పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు

పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు

చిత్తూరు అర్బన్‌: 2025లో ఉత్తమ సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లాలోని పలువురు పోలీసుల కు సేవా పతకాలు ప్రకటిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా చిత్తూరు ఏఎస్పీ (ఆపరేషన్స్‌) ఎస్‌ఆర్‌.రాజశేఖర్‌రాజుకు ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం లభించింది. రాష్ట్ర పోలీసుశాఖ శుక్రవారం పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు, అతిఉత్కృష్ట పతకాలను ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచి ఏఎస్‌.రవిశంకర్‌ (ఏఆర్‌ఎస్‌ఐ–డీఏఆర్‌), వి.నాగరాజ (హెచ్‌సీ–చిత్తూరు వన్‌టౌన్‌), ఎ.లీలాసుఖనాయుడు (హెచ్‌సీ–పలమనేరు), పి.గోవిందరాజులు (ఏఆర్‌హెచ్‌సీ–డీఏఆర్‌), జి.పరమేష్‌ (హెచ్‌సీ–రాళ్లబూదుగూరు), ఉత్కృష్ట సేవా పతకాలు లభించిన వారిలో కె.మధుబాబు (హెచ్‌సీ–కాణిపాకం), ఎం.జయవేలు (ఏఆర్‌హెచ్‌సీ–డీఏఆర్‌), ఎస్‌.కేశవులు (హెచ్‌సీ–వి.కోట), బి.ఢిల్లీ (హెచ్‌సీ–గుడిపాల), కె.నవీన్‌కుమార్‌ (పీసీ–చిత్తూరు తాలూకా) ఉన్నారు.

తిరుపతి జిల్లా నుంచి..

తిరుపతి జిల్లాలో అతి ఉత్కృష్ట సేవా పతకాలు లభించిన వారిలో ఎన్‌.సుధాకర్‌ చౌదరి (ఏఎస్‌ఐ–తిరుమల ట్రాఫిక్‌), బి.రాము (హెచ్‌సీ–తిరుపతి వెస్ట్‌), కె.ఆనందయ్య (హెచ్‌సీ–తిరుపతి ఈస్ట్‌), పివి.ఆనందకుమార్‌ (హెచ్‌సీ–తిరుపతి డీసీఆర్‌బీ), ఆర్‌.విజయభాస్కర్‌ (హెచ్‌సీ–తిరుపతి డీసీఆర్‌బీ), యు.మార్కెండేయులు (హెచ్‌సీ–తిరుపతి రూరల్‌), ఆర్‌.నరసింహులు (హెచ్‌సీ–భాకరాపేట), పి.డేవిడ్‌ (హెచ్‌సీ–తిరుపతి సీసీఎస్‌), ఆర్‌.చంద్రశేఖర్‌(హెచ్‌సీ–ఎస్వీయూ), పి.తారాపతి (హెచ్‌సీ–డీసీఆర్‌బీ), బి.మునిరాజ్‌ (హెచ్‌సీ–డీసీఆర్‌బీ), ఎం.సిద్దయ్య (హెచ్‌సీ–తిరుమల ట్రాఫిక్‌), ఎస్‌కె.రసూల్‌ (హెచ్‌సీ–సైబర్‌సెల్‌), ఆర్‌.రాజేంద్ర (ఆర్‌ఎస్‌ఏఎస్టీఎఫ్‌–తిరుపతి) ఉన్నారు. ఉత్కృష్ట సేవా పతకాలు లభించిన వారిలో తిరుపతి ఆర్‌వీ అండ్‌ ఈవో ఎస్పీ షరీఫ్‌ కరీముల్లా, బి.సుధాకర్‌ (హెచ్‌సీ–తడ), ఇ.నాగూర్‌ (ఏఆర్‌హెచ్‌సీ–డీఏఆర్‌), ఎన్‌.మోహన్‌బాబు (ఏఆర్‌పీసీ–డీఏఆర్‌), కె.కులశేఖర్‌ (హెచ్‌సీ–పాకాల), బి.ఢిల్లీబాబు (పీసీ–మహిళా స్టేషన్‌), పి.ప్రవీన్‌ (పీసీ–తిరుచానూరు), టి.దేవరాజులు (పీసీ–తిరుచానూరు), కె.శరవణ (పీసీ–డీసీఆర్‌బీ), పి.హేమంత్‌కుమార్‌ (పీసీ–రేణిగుంట), పి.బాలసుబ్రమణ్యం (ఏఆర్‌పీసీ–డీఏఆర్‌) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement