కొత్త వైరెటీలు | - | Sakshi
Sakshi News home page

కొత్త వైరెటీలు

Feb 26 2026 7:38 AM | Updated on Feb 26 2026 7:38 AM

కొత్త

కొత్త వైరెటీలు

సత్ఫలితాలు ఇస్తున్న కొమ్మ అంటు పద్ధతి పాత తోటల స్థానంలోకొత్త కొత్త వైరెటీలు మార్కెట్‌లో గిరాకీ ఉన్న తోటలుగా రూపాంతరం ఎకరా మామడి తోటకు అయ్యే ఖర్చు రూ.ఐదు వేలు

పాత మామిడి..
కొత్త వైరేటీలు

మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు. సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయొచ్చని పూర్వమే మన మహర్షులు నిరూపించారు. ఆ బాటలోనే నేడు మన శాస్త్రవేత్తలు పయనిస్తున్నారు. అంటుకట్టడం ద్వారా మామిడి చెట్టు ఒకటే అయినా వివిధ రకాల ఫలాలను పండిస్తున్నారు. ఎప్పుడో తాతల కాలం నాటి మామిడి చెట్లలో మనకు కావాల్సిన మేలైన మల్లిక, బేనీషా ఇలా పలు రకాలను పండించుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు మామిడిలో కొమ్మ అంటుకట్టే (టాప్‌ వర్కింగ్‌) పద్ధతి ట్రెండింగ్‌గా మారింది. పాత తోటల్లో దిగుబడిన తగ్గి నష్టాలతో సతమతమవుతున్న రైతులకు ఇది వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలోనూ మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలు సాధించవచ్చు.

పలమనేరు : చిత్తూరు జిల్లాలో సుమారు 60 శాతం తోతాపురి రకం మామిడి తోటలు ఉన్నాయి. ఈ కాయలను పల్ప్‌ కోసం కొంటారు. జ్యూస్‌ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారెంటీ మార్కెటింగ్‌ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మామిడి కాయలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. కనీసం కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు రైతులు కాయలు కోకుండా చెట్లలోనే వదిలేశారు. ఈ క్రమంలో కొంతమంది రైతులు కొమ్మ అంటు కట్టే పద్ధతిలో మార్కెట్‌లో మంచి ధర పలికే బేనీషా, ఖాదర్‌, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలుగా మార్పు చేసుకున్నారు.

అంటు ఎలా కడతారంటే..

పాత తోటల్లో రోగాలు సోకి దిగుబడి లేకుండా ఉన్న చెట్లకు టాప్‌ వర్కింగ్‌, గ్రాఫ్టింగ్‌ లాంటి అంటు కట్టే పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వైరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనీషా చెట్టును (మదర్‌ ప్లాంట్‌) ఎంపిక చేసుకోవాలి. తర్వాత తోటలోని అనవరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్‌ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో ధృడంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని మిగిలిన వాటిని తీసేస్తారు. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్‌ ప్లాంట్‌ నుంచి చిగుర్లను కట్‌ చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకుంటారు. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్‌ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలైన రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్‌ ట్యాగ్‌ను చుడతారు. చెట్టులో మనము ఏదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుకట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాది నుంచి కోతకొస్తాయి. పాత మామిడి తోటలను పరిశీలిస్తే ఎకరాకు సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.8 లెక్కన రూ.8 వేలు అవుతుంది.

మామిడి రైతులు

26 వేల మంది

కొత్త వైరెటీలు1
1/1

కొత్త వైరెటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement