తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత

Feb 26 2026 7:38 AM | Updated on Feb 26 2026 7:38 AM

తమిళన

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత

నగరి : తమిళనాడు తిరుపూర్‌ నుంచి వచ్చి నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు శివారులో ఏర్పాటుచేసిన డైయింగ్‌ యూనిట్‌ మూతపడింది. ఈ యూనిట్‌ను వారం రోజుల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజి నాయక్‌ తనిఖీ చేసి మూసివేయాలంటూ హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో యాజమాన్యం బుధవారం యూనిట్‌ను మూసివేశారు. యంత్రాలను తిరుపూర్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ డైయింగ్‌ యూనిట్లపై దశలవారీగా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు హాని కలిగించే వారిని ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,902 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,869 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.05 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

పారదర్శకత కోసమై

డిజిటలైజేషన్‌

తిరుపతి సిటీ: ఎస్వీయూలో పరీక్షల విభాగంలో విద్యార్థులకు పారదర్శకతతో సేవలు అందించేందుకు డిజిటలైజేషన్‌ చేసినట్టు వీసీ టాటా నర్సింగరావు తెలిపారు. ఆయన బుధవారం అధికారులతో కలిసి వర్సిటీలోని డిజిటల్‌ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షల వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు వేగవంతమైన సేవలు అందించడం, ఫలితాలను సరైన సమయానికి వెల్లడించడం సాధ్యమవుతుందని తెలిపారు. అలాగే మాన్యువల్‌ జోక్యాన్ని తగ్గించి పారదర్శకతకు పెద్ద పీఠ వేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, ఎగ్జామినేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సురేంద్రబాబు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ రాజామాణిక్యం పాల్గొన్నారు.

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత 
1
1/2

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత 
2
2/2

తమిళనాడు డైయింగ్‌ యూనిట్‌ మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement