రెండవ సెమిస్టర్‌లో కొత్త పాఠ్యపుస్తకం
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, సింగిల్ మేజర్స్) మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్‌లో కొత్త పాఠ్య పుస్తకం ప్రవేశపెట్టారు. శనివారం ఆ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ విలేకరులతో మాట్లాడారు. మొదటి సంవత్సరంలో డిజిటల్ టాజిక్ డిజైన్ అనే కొత్త పుస్తకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని తమ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ హెచ్‌వోడీ రచించారన్నారు.
పరిసరాల పరిశుభ్రత బాధ్యత
చిత్తూరు కార్పొరేషన్ : కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత బాధ్యతని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యాలయంలో భాగంగా స్థానిక కొంగారెడ్డిపల్లె సబ్‌స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ పరిసరాలను కాసేపు శుభ్రం చేసి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈ రాము పాల్గొన్నారు.
మహిళ మెడలో
గొలుసు అపహరణ
శ్రీరంగరాజపురం : మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన సంఘటన మండలంలోని చిన్నతయ్యూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. బాధితురాలు కథనం మేరకు చిన్నతయ్యూరు వద్ద కోకిల అనే మహిళ కిరాణా షాప్ నడుపుతోంది. శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు షాప్‌నకు మా స్క్ ధరించి వచ్చి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును అపహరించుకుపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపు వారు ద్విచక్రవాహనంలో పరారయ్యారు. బాధిత మహిళ కోకిల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తండ్రీ, తనయుల ఆత్మహత్యాయత్నం
– మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలింపు
కార్వేటినగరం : పురుగుమందు తాగి తండ్రి, కొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి కార్వేటినగరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా... మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలి వద్ద బేకరీ నడుపుకుంటున్న రవి(42) స్థాయికి మించి అప్పులు చేయడంతో వాటిని చెల్లించే స్థోమత లేక శనివారం రాత్రి తనతో పాటు తన కుమారులు చరణ్(16), గోపి(15)లకు పురుగుమందు ఇచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


