మాతృభాషను కాపాడుకుందాం
పలమనేరు : మాతృభాషను కాపాడుకున్నప్పుడే మన అస్తిత్వం నిలబడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కళా మందిరంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు భువన విజయం నాటకాన్ని ప్రదర్శించారు. చంద్రశేఖర్ రాసిన పరమ వీరచక్ర పుస్తకాన్ని డీఈవో ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో తెలుగు భాషపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 60 మంది విద్యార్థులకు సమితి అధ్యక్ష, కార్యదర్శులు తులసీనాథం నాయుడు,పుష్ప బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువు రు ఎంఈవోలు, సాహితీప్రియులు పాల్గొన్నారు.


