వీవోఏలపై వేధింపులకు స్వస్తి పలకాలి | - | Sakshi
Sakshi News home page

వీవోఏలపై వేధింపులకు స్వస్తి పలకాలి

Feb 22 2026 8:07 AM | Updated on Feb 22 2026 8:07 AM

వీవోఏలపై వేధింపులకు  స్వస్తి పలకాలి

వీవోఏలపై వేధింపులకు స్వస్తి పలకాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : వీవోఏల వేధింపులకు చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలకాలని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై శనివారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. వీవోఏల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామన్న చంద్రబాబు రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక సమస్యనూ పరిష్కరించిన పాపానపోలేదని విమర్శించారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఏపీఎంలు, సీసీలు బెదిరింపులకు స్వస్తి పలికాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement