బెల్ట్ షాప్‌పై దాడి
బంగారుపాళెం: పట్టణంలోని ఓ మద్యం బెల్ట్ షాప్‌పై సోమవారం పోలీసులు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిపబ్లిక్ డే రోజు పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో గల వే బ్రిడ్ వద్ద అక్రమంగా బెల్ట్ షాప్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఎస్‌ఐ ప్రసాద్, ఏఎస్‌ఐ మల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ కిర ణ్, కాని స్టేబుల్ మోహన్ దాడి చేశారు. వివిధ రకాల 15 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నా రు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మ ద్యం కేస్‌లను ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ సేవలకు అవార్డు
చిత్తూరు కార్పొరేషన్: డిస్కం పరిధిలో అత్యుత్తమ విద్యుత్ సేవలందించినందుకు చిత్తూరు జిల్లాకు అవార్డు లభించింది. సోమవారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ శివశంకర్ చేతుల మీదుగా చిత్తూరు ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ అవార్డు అందుకున్నారు. డిస్కం (రాయలసీమ, నెల్లూరు జిల్లాల)పరిధిలో ఈ అవార్డు స ర్కిల్‌కు వచ్చింది. వీటితో పాటు విద్యుత్ అంతరాయాలు తక్కువ, రెవెన్యూ కలెక్షన్, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ విభాగాలలో పుంగనూరు డివిజన్ ప్రతిభ చాటింది. టెక్నికల్ ఈఈ మోహనమ్మ, పుంగనూరు ఈఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి స్పోర్ట్స్ మీట్
తిరుపతి సిటీ : తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ వేదికగా బుధవారం నుంచి రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకనాథ్‌రెడ్డి తెలి పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ శుక్ర వారం వరకు కొనసాగనున్న స్పోర్ట్స్ మీట్ రాష్ట్రంలోని పలు కళాశాలల నుంచి సుమారు 1,500 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సౌకర్యాలకు కల్పించనున్నట్లు వివరించారు.
విజృంభిస్తున్న ఇసుకాసురులు
గంగవరం: ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం ప్రజల నుండి వస్తున్న విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇసుకాసురులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు ఇప్పటి పరిస్థితులు చెబుతున్నాయి. ఇసుక లోడ్‌తో ఓ ట్రాక్టర్ రోడ్డు పక్కన గంటల తరబడిగా ఉన్నా అటుగా వెళ్లిన ఏ అధికారి కూడా పట్టించుకోకుండా చూసీచూడనట్టు వెళ్లిపోయారు. వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి ఇలా పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఆ మార్గంలోనే వెళ్లారు. వారికి ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేయడం పెద్ద పనేమి కాదు. అయితే అంతటి సాహసానికి దిగడం లేదు. దీన్నిబట్టి కూటమి ఇసుకాసురులకు ప్రభుత్వ అధికారులు సలాం కొట్టాల్సిందేనని ప్రజలు మండిపడుతున్నారు.
సార్జెంట్ దేవరాజ్ హఠాన్మరణం
తిరుపతి సిటీ : ఉమ్మ డి చిత్తూరు జిల్లా రైఫి ల్ షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ సార్జెంట్ ఎస్.దేవరాజ్ (64) సోమవారం హఠాన్మరణం చెందారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని బాలాజీనగర్ లేఔట్‌లో నివసిస్తున్న ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. దేవరాజు కుటుంబంలో రెండు రోజుల్లోనే రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. దేవరాజ్ అక్క భర్త డేనియల్ శనివారం మృతి చెందారు. రెండు విషాదాలు వాటిల్లడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు.
ఎయిర్‌ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి
సార్జెంట్ దేవరాజ్ భౌతికకాయానికి ఎయిర్‌ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి చాప్టర్ వారు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి అంజలి ఘటించారు. దేశానికి, క్రీడారంగానికి దేవరాజ్ చేసిన సేవలను కొనియాడారు. సంఘం సభ్యులు ఏఎస్‌బీ ప్రసాద్, బాలాజీ, ఎస్‌ఎస్ రెడ్డి, ఎస్‌ఎమ్‌కే కృష్ణమూర్తి, ఎస్‌బీన్ స్వామి, పి.సుధాకర్, సిద్ధయ్య, గిరిధర్‌సింగ్, సురేష్ కుమార్, జనార్ధన్, రత్న కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, డేవిడ్ రాజు పాల్గొన్నారు.
బెల్ట్ షాప్‌పై దాడి
బెల్ట్ షాప్‌పై దాడి
బెల్ట్ షాప్‌పై దాడి


