సరస్వతీ పుత్రుడికి అనారోగ్యం!
ట్రిబుల్ ఐటీలో సీటొచ్చినా విద్యకు దూరం
జ్వరంతో బ్రెయిన్‌స్ట్రోక్
ఆఫై హార్ట్‌స్ట్రోక్‌లు
మెదడు శస్త్రచికిత్స.. ఆపై బైపాస్ సర్జరీలు
ఇప్పటికే రూ.30 లక్షల దాకా ఖర్చు
అక్కరకు రాని ఎన్టీఆర్
వైద్య సేవలు
చికిత్సలకు నెలకు రూ.30 వేలు అవసరం
దాతల కోసం తల్లిదండ్రుల
ఎదురుచూపు
పలమనేరు: కొడుకు టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చాడు. ఇడుపులపాయలోని ట్రిబుల్ ఐటీలో సీటు సంపాదించుకున్నా డు. ఇంకేందులే అనుకున్నారు. కానీ ఆ ఆనందం తల్లిదండ్రులకు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. కళాశాలలో అడ్మి షన్ దొరికి తరగతులకు వెళ్లాల్సిన సమయంలో మాయదారి జ్వరం వచ్చింది. అది బాగుకాక మెదడుకు సోకింది. బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఆపరేషన్ చేయించారు. ఆపై హార్ట్‌స్ట్రోక్‌తో బైపాస్ సర్జరీ. మళ్లీ మరో ఆపరేషన్ చేయించాలట. ఇప్పటికే అప్పు చేసి రూ.30లక్షల దాకా బిడ్డ వైద్యానికి ఖర్చుచేశారు. మరో ఆపరేషన్‌తోపాటు వైద్య ఖర్చుల కోసం డబ్బుల్లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బిడ్డకు చదు వులేకుండా పోయింది.. కనీసం వాడి ప్రాణాలనైనా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఈ దయనీయమైన ఘటన పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం కీలపట్లలో చోటుచేసుకుంది.
జ్వరంతో మొదలై!
కీలపట్ల గ్రామానికి చెందిన కేజే మూర్తి గత ప్రభుత్వంలో ఈజీఎస్‌లో ఫీల్డ్‌అసిస్టెంట్. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న కుమారుడైన జస్వంత్(16) చిన్నప్పు డే పోలీయో బారినపట్టాడు. అయితే చదువులో దిట్ట. గత ఏదాడి టెన్త్‌లో స్కూల్ టాపర్. ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించాడు. కుటుంబీకులు ఎంతో ఆనందపడి బిడ్డను అక్కడ అడ్మిషన్ చేయించారు. ఇంతలో జ్వరం రావడంతో క్లాసులకు వెళ్లలేక ఇంట్లో ఉంట్లో ఉండిపోయాడు. ఆస్పత్రుల్లో వైద్యంకోసం తిరిగా రు. జ్వరం నయంగాక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆరు నెలల క్రితం స్విమ్స్‌లో మెదడుకు ఆపరేషన్ చేశారు. దేవుడా కాపాడావు తండ్రీ.. అనుకున్న సమయంలో హార్ట్‌స్ట్రోక్ రావడంతో అదే ఆస్పత్రిలో మళ్లీ బైపాస్ సర్జరీ చేశారు. కొంతమేర ప్రాణదాణం పథకం ద్వారా సాయమందగా కుటుంబీకులు రూ.30 లక్షల దాకా అప్పు చేసి వైద్యం కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు మరో సర్జరీ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో నెలకు వైద్య ఖర్చులకే రూ.30 వేలు దాకా అవసరం. ఇదే వీరికి భారమైంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌కు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కొడుకుపై బెంగపెట్టుకున్న తండ్రి కేజే మూర్తి సైతం అనారోగ్యంతో మంచమెక్కాడు. తల్లి జమున పాడి ఆవులు మేపుకుంటూ భర్త, బిడ్డలకు వైద్యం, కుటుంబాన్ని వెళ్లీదుతోంది.
ఆదుకోని ఎన్టీఆర్ వైద్య సేవలు
ఇలా ఉండగా స్విమ్స్‌లో సైతం ఎన్టీఆర్ వైద్య సేవలందలేదని బాలుని తండ్రి తెలిపాడు. ప్రాణదానంతో కొంత సాయమందినా రూ.30 లక్షల దాకా అప్పు చేసి పెట్టామని చెప్పారు. గతంలో నుంచి బాలునికి వికలత్వ పింఛను అందుతోందని, దాన్ని తొలగించేందుకు ఇప్పటికే మూడు నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలవారి వైద్య ఖర్చుల కోసం హెల్త్ పింఛను ఇవ్వాలని కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదని వాపోయాడు. తన బిడ్డను కాపాడుకోవాలంటే ఎవరైనా దాతలు సాయం చేయాలని విన్నవిస్తున్నాడు. దాతలు బాధితుడి మొబైల్ నం.94405 40106కు ఫోన్ చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.


