● చిత్తూరు పేరు నిలబెట్టాలి
గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలన కార్యక్రమంలో వింత ఘటన చోటు చోసుకుంది. ప్రశంసాపత్రాల పంపిణీ అనంతరం మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించేందుకు కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు వెళ్లారు. ఆ సమయంలో రైతు విభాగం ఆధ్వర్యంలో కోళ్లు, పొట్టేళ్లు, పుంగనూరు దూడలను ఏర్పాటు చేశారు. ఆ స్టాల్‌ను పరిశీలిస్తుండగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెరొక కోడి పుంజును చేతిలోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆ రెండు కోడి పుంజులు పోట్లాడేందుకు తలపడ్డాయి. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రజలు సంక్రాంతి పండుగలో కోడి పందేలు చూశాం గానీ.. గణతంత్ర దినోత్సవంలో కోళ్లు తలపడడం వింతగా ఉందని గుసగుసలాడారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకోళ్లు బాగా పెంచడి.. ఈ సారి చిత్తూరు పేరు నిలబెట్టాలిశ్రీ అంటూ రైతులకు సూచించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పుంగనూరు దూడను ఎత్తుకుని ఆ దూడ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. – చిత్తూరు కలెక్టరేట్


