కార్యకర్తలే వైఎస్సార్‌సీపీకి బలం
బంగారుపాళెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని టేకుమంద పంచాయతీ గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలేపేతం చేసేందుకు ఆసక్తి, ఉత్సాహం, బాధ్యత కలిగిన కార్యకర్తలకు గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు సర్కార్ యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పి మోసగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో యువకులు సైనికులుగా పనిచేసి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకు వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంని చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మాజీ కురబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అమరనాథ్, నియోజకవర్గ సోషియల్ మీడియా అధ్యక్షుడు రెడ్డెప్ప, ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు.


