
బెయిల్ రావాలంటూ పూజలు
చౌడేపల్లె : మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలంటూ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరాజు మంగళవారం బోయకొండలో గంగమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటిి నుంచి ఏదో ఒక రకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి హింసించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. 2014–2019 దాకా ఊరూరా బెల్టుషాపులు తెచ్చి దోచుకున్నది చంద్రబాబేననంటూ ఆరోపించారు. బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో అక్రమంగా అరెస్ట్ అయిన మిథున్‌రెడ్డికు బెయిల్ రావాలని పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గం
బైరెడ్డిపల్లె : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, జడ్పీటీసీ ఆర్.కేశవులు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి మండిపడ్డారు. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడంపై బైరెడ్డిపల్లెలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వందల మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినా వైఎస్సార్‌సీపీని అణచివేయలేరన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇతర కేసుల్లో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి దయానందగౌడు, మండల యూత్ ప్రెసిడెంట్ మహేష్, మండల కన్వీనర్ కార్తిక్, వైస్ ఎంపీపీలు రూపజయకుమార్‌రెడ్డి, నారాయణస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికించారు : జెడ్పీ చైర్మన్

బెయిల్ రావాలంటూ పూజలు