
పీ–4 పేరుతో నిర్బంధం సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : పీ–4 కార్యక్రమం పేరుతో టీచర్లను నిర్బంధం చేయడం సరికాదని పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జీరో పావర్టీ (పీ–4) కార్యక్రమంలో టీచర్లు విద్యార్థి కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు నిర్బంధం చేయడం సబబు కాదన్నారు. పీ–4 విధానంలో ప్రతి హెచ్‌ఎం కనీసం ఐదు కుటుంబాలను, టీచర్లు 2 కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకుని ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు.