
రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలి
పలమనేరు: జిల్లాలో రహదారి నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు పలమనేరు నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎండీఆర్, ఎస్‌హెచ్, నాబార్డ్ నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆరు నెలల్లో వీటిని పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని మూడు అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రిని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.