
అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలి
వెదురుకుప్పం: అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. ఆయన శుక్రవారం వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నేర ప్రవృత్తికి సంబంధించిన విషయాలపై అప్రమత్తంగా మెలిగి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసుల్లో దర్యాప్తులను ముమ్మరం చేసి వెంటనే అరెస్టులు చేయాలన్నారు. కీలక హత్య కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చార్జిషీట్లను కోర్టులకు సమర్పించాలని చెప్పారు. చివరిగా సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఉన్నారు.