
బెయిల్ రావాలంటూ పూజలు
చౌడేపల్లె : అక్రమ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ స్థానిక క మలాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ బోయకొండ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, పార్టీ నేతలు కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పే రిట ప్రత్యేక అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అక్ర మ కేసుల నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి త్వరగా కడిగిన ముత్యంలా బయటకు రావాలంటూ పూజలు చేశా రు. కార్యక్రమంలో సర్పంచులు షంషీర్‌ం, వరుణ్ నా యకులు ఠాణాధార్ నాగరాజ, వెంకట రమణ, అమరనాథ్, పవన్, భాస్కర్, హరీష్, విజయ్, కృష్ణారెడ్డి, బాబు, చంద్రశేఖర్, మంజునాథ్, తదితరులున్నారు.