పరిహారం కోసం రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం రైతుల ఆందోళన

Jul 31 2025 8:20 AM | Updated on Jul 31 2025 8:20 AM

పరిహా

పరిహారం కోసం రైతుల ఆందోళన

● హంద్రీ–నీవా కాలువ కోసం భూములిచ్చిన రైతులు ● పది మంది రైతులకు అందని పరిహారం ● 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు ● పట్టించుకోని సీఎం చంద్రబాబునాయుడు

గుడుపల్లె : చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా నీరు తీసుకువచ్చేందుకు కాలువ తవ్వారు. ఇందులో భాగంగా కుప్పం, గుడుపల్లె తదితర మండలాలకు చెందిన పలువురు రైతుల నుంచి భూమి సేకరించారు. గుడుపల్లె మండలం కాడేపల్లె, ఒంటిపల్లె గ్రామాలకు చెందిన 10 మంది రైతులకు ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. పరిహారం కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం పనులను అడ్డుకున్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని భీష్మించారు.

భూములకు పరిహారం అందని రైతులు

హంద్రీ–నీవా కాలువకు భూములు కోల్పోయి పరిహారం అందని వారిలో పది మంది రైతులు వున్నారు. గోవిందమ్మకు సంబంధించి సర్వే నంబరు 60–1లలో 0.19 సెంట్ల భూమి, ఒక చింతచెట్టు, అలాగే 60–2లో 0.14 సెంట్లు, 60–3లో 0.17 సెంట్లు, 60–1లో 0.30 సెంట్ల భూమి తీసుకున్నారు. అలాగే సుందరప్పకు చెందిన భూమిలో సర్వేనంబర్‌ 60–2బిలో 0.17 సెంట్ల భూమి, బావి ఒకటి, 60–4బిలో 0.53 సెంట్లు, మునిరత్నంకు సంబంధించి సర్వే నంబర్‌ 61–3బిలో 0.07 సెంట్లు, లక్ష్మమ్మకు చెందిన 60–2బిలో 0.16 సెంట్లు, బోరు, టేకు చెట్లు 4, చింత చెట్లు 2, నీలగిరి చెట్లు 16, సాకమ్మకు సంబంధించిన సర్వేనంబర్‌ 60–2బిలో 0.12 సెంట్లు, చింతచెట్టు 1, చిగరచెట్లు 10, నాగప్పకు సంబంధించి సర్వే నంబర్‌ 61–6బిలో 0.21 సెంట్లు, 60–1లో 0.19 సెంట్లు, దేవేంద్రకు సంబంధించి సర్వే నంబర్‌ 26–1బిలో ఎకరా, 4 కొబ్బరి చెట్లు, చామంతి తోట 0.50 సెంట్లు, వెంకటప్పకు సంబంధించి సర్వేనంబర్‌ 22–సిలో 1.28 ఎకరాలు, సుందరప్ప సంబంధించి 63–1లో బావి ఉన్నాయి. వారికి ఎనిమిదేళ్లయినా పరిహారం ఇవ్వలేదు. భూములు కోల్పోయి పరిహారం అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు, విజయవాడకు వెళ్లి మరీ అర్జీలు ఇచ్చినా పరిహారం అందలేదని బాధిత రైతులు వాపోతున్నారు.

పట్టాదారు పుస్తకాలు లాక్కున్నారు

హంద్రీ–నీవా కాలువకు భూములు సేకరించిన రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా లాక్కున్నారు. దీనివల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదు. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా వీలులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం ఇవ్వకపోగా పట్టాదారు పాసుపుస్తకాలు కూడా తీసుకోవడంతో తాము అన్ని విధాలా నష్టపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి తమకు పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు

పరిహారం కోసం రైతుల ఆందోళన 1
1/1

పరిహారం కోసం రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement