
కాపర్ తీగల దొంగల అరెస్టు
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం గంగమ్మ గుడిలో విగ్రహం, ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ తీగలను చోరీ చేసిన నిందితులను బుధవారం ఆరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. గంగమ్మ గుడిలోని పంచలోహ విగ్రహాన్ని చోరీ చేసి పరారీలో ఉన్న దినేష్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిరంజీవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరే మండలంలో రైతుల పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగలను దొంగతనం చేశారని నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేసి చిత్తూరు కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.