
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కాళ్ల నొప్పులు భరించలేక ఓ వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చిత్తూరు నగరంలోని నరిగపల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మల్లికార్జున వివరాల మేరకు.. నరిగపల్లి యానాది కాలనీకి చెందిన రాజు (44) కొన్నాళ్లుగా తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పులు భరించలేక గత నెల 27వ తేదీన పురుగుల మందు తా గి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆ వ్యక్తిని చికి త్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శ్రీరంగరాజపురం : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండంలోని అంకనపల్లి చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, సింగంపల్లి గ్రామానికి చెందిన జగ్గయ్య కుమారుడు కోండల్‌గౌడ్ (35) పాలసముద్రం మండలంలోని ఓ పాల డెయిరీలో రీజనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా మండలంలో పాల సేకరణ కోసం వచ్చాడు. ఏమైందో ఏమోగానీ బుధువారం రాత్రి అంకనపల్లి చెరువు వద్ద ఉన్న బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతుడు కోండల్‌గౌడ్‌గా గుర్తించారు. చిత్తూరు ఫైర్ సిబ్బంది సహకరంతో బావిలో ఉన్న మృతదేహన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోట చెరువులో మహిళ మృతదేహం
కార్వేటినగరం: కోట చెరువులో మహిళా మృతదేహం కలకలం రేపింది. సీఐ హనుమంతప్ప ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయం, నగర వీధుల్లో మతిస్థిమిత్తం లేకుండా తిరుగాడుతున్న మహిళగా గుర్తించామన్నారు. మల విసర్జన కోసం చెరువు వద్దకు వచ్చి కాలుజారి పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారికి అప్పగిస్తామని, లేనిపక్షంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్మికుల చేత దహన క్రియలు నిర్వహిస్తామన్నారు. సీఐ వెంట ఏఎస్‌ఐలు మునికృష్ణ, ఏలుమలైరెడ్డి, సిబ్బంది రాజ, మురళీకృష్ణరాజు ఉన్నారు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య