
చిత్తూరు అభివృద్ధికి కృషి
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ఆ సొసైటీ సభ్యులు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీని కలిసి ప్రణాళిక అందజేశారు. ఆయన మాట్లా డుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాకు ఏళ్ల సంవత్సరాల ఘన చరిత్ర ఉందన్నారు. చిత్తూరును టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జలాశయం వద్ద త్రివేణి సంగమం, పుష్కర ఘాట్, అష్టదేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతామన్నారు. కలవగుంట వద్ద 108 అడుగుల శివుని విగ్రహం, త్రివేణి సంగమం, పుష్కర ఘాట్లను నిర్మిస్తామన్నారు. చిత్తూరులోని నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద నెమలి, గరుడ, నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సొసైటీ సభ్యులు చంద్రబాబు, శివకుమార్, అశోక్ పాల్గొన్నారు.