
104 డీఎంపై కక్ష సాధింపులా?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): బీఎన్‌ఆర్‌పేట ప్రాంతంలో ఉన్న హోటల్‌కు, 104 డీఎం ప్రతాప్‌కు ఎలాంటి సంబంధం లేదని 102 (తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్) డ్రైవర్ హేమంత్ పేర్కొన్నారు. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం 102 డ్రైవర్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను 102లో డ్రైవర్‌గా పనిచేస్తూ..చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌పేట ప్రాంతంలో చిన్న హోటల్ నడిపిస్తున్నానన్నారు. చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన ప్రేమ అనే మహిళ నుంచి ఈ హోటల్‌ను వంట సామాన్లతో సహా కొనుగోలు చేశానన్నారు. ఈ షాపు కొనుగోలు చేసి కేవలం ఐదు నెలలు అయ్యిందని, చేతిలో ఉన్న డబ్బులు మొత్తం హోటల్ కొనుగోలు, నిర్వహణకు పెట్టేశానన్నారు. దీని కారణంగా హోటల్‌లో ఎలాంటి మార్పులు చేపట్టలేకపోయనన్నారు. గతవారం తనపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి అధికారులు విధుల నుంచి తొలగించారన్నారు. ఈ హోటల్ నిర్వహణలో 104 డీఎంకు కూడా సంబంధాలున్నాయని పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. డీఎంకు.. ఈ హోటల్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ హోటల్‌కు వేసిన రంగులు, ఫోన్ నెంబరు మారలేదని కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన వివరించారు.