
ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ పోటీల్లో మెరిసిన రొంపి
రొంపిచెర్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2024–25 ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ పోటీలలో రొంపిచెర్ల మండలానికి చెందిన చిన్నారి మన్విత మాన్య మొదటి స్థానంలో నిలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బండకిందపల్లె గ్రామ సచివాలయ సర్వేయర్ మానస కుమారై మన్విత మాన్య తిరుపతిలోని ఓ స్కూల్‌లో ఒకటవ తరగతి చదువుతోంది. ఈ నెల 27న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ పోటీలలో పాల్గొని ప్రతిభ చాటింది. టైటిల్ విన్నర్‌కు బహుమతిలోపాటు వెబ్ సిరీస్ సినిమా చాన్స్ , యాడ్ షూట్ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు.