
పీ–4పై వేధింపులు దారుణం
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
వి.కోట : సూపర్ ీసిక్స్ హామీల అమలు లో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజ ల దృష్టిని మరల్చేందుకే ‘‘పూర్‌టూ రిచ్’’అనే పేరుతో పేదలను ధనికులు దత్తత తీసుకోవాలంటూ పీ–4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం మండలంలోని పి.కొత్తూరు క్యాంపు కార్యాల యంలో జెడ్పీ చైర్మన్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన జీరో పావర్టీ పీ–4 కార్యక్రమం అధికారు లు, ప్రభుత్వ ఉద్యోగులకు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం 24 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ సిబ్బందికి పేద కు టుంబాల దత్తత కోసం కాల పరిమితిని విధించి టారెగ్ట్‌లు విధించడం ఏమిటని ప్రశ్నించారు. జీరో పావర్టీ (పీ–4) కార్యక్రమం పేరుతో ప్రతి హెచ్‌ఎం, టీచర్లు బంగారు కు టుంబాలను దత్తత తీసుకుని ఆన్‌లైన్ లో రిజిష్టర్ చేయాలని ఒత్తిడి చేయడం సబబు కాదన్నారు. చిరుద్యోగులు, ఉ పాధ్యాయులకు జీతాలే సక్రమంగా ఇ వ్వని నేపథ్యంలో వారిని నిర్బంధం చే యడం అన్యాయమన్నారు. ఈనెల 31వ తేదీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన షెడ్యూల్ ఖరారై న నేపథ్యంలో ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం దారుణమన్నారు. హెలీప్యాడ్ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, అభిమానులు తరలిరావడానికి అవకాశం లేదని, ర్యాలీగా వెళ్లొద్దని వివిధ ఆంక్షలతో వైఎస్సార్‌సీపీ నేతలకు నోటిసులు ఇవ్వడంపై జెడ్పీ చైర్మన్ మండిపడ్డారు.