
ఎంపీపీ ద్విచక్ర వాహనం చోరీ
శ్రీరంగరాజపురం : స్థానిక ఎంపీపీ ద్విచక్ర వాహనం చోరీకి గురైన ఘటన చిన్నతయ్యూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఎంపీపీ కథనం.. సోమవారం ఉదయం చిత్తూరు– పుత్తూరు జాతీయ రహదారి చిన్నతయ్యూరు గ్రామంలోని తన పొలం వద్ద ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేశారు. ఆపై వ్యవసాయ మోటారు ఆన్‌చేసి వచ్చి చూడగా ద్విచక్ర వాహనం కనిపించలేదు. అనంతరం బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుమన్ పేర్కొన్నారు.
ప్రతి ఫైలూ పూర్తి చేస్తున్నాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రతిఫైల్‌నూ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని, ఒక్క ఫైల్‌ను కూడా పెండింగ్‌లో పెట్టడం లేదని మైనింగ్‌శాఖ ఉపసంచాలకులు పేర్కొన్నారు. ఇటీవల సాక్షి దినపత్రిలో ‘అక్రమాల గనుడు’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్‌లను ఎప్పటికప్పడు పూర్తి చేస్తున్నామన్నారు. గ్రానైట్ బండలు తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. బిల్లులు లేకుండా తరిలించే వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.
స్కిట్ కళాశాలలో అడ్మిషన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను మూడు సంవత్సరాల కిందట ఆలయ ఆర్థిక భారంతో మూత వేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్కిట్ కళాశాల జేఎన్‌టీయూ, స్కిట్ అనుసంధానంతో సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఇంజినీరింగ్‌కు సంబంధించిన విద్యార్థుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో అనుమతించారు. ఇందులో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ అండ్ మెషన్ లెర్నింగ్, సీఎస్‌టీ(డేటా సైన్స్), ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ సంబంధించి 66 సీట్లు చొప్పున మొత్తం 330 సీట్లు అలాట్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒకో పోస్టుకు రూ.70 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహకారంతో కళాశాల ప్రారంభం చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్కిట్ కళాశాల వద్ద మంగళవారం సంబరాలు చేసుకోనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు కేసులు, నాన్‌టీచింగ్, టీచింగ్‌కు సంబంధించి 90 మంది గతంలో పనిచేసే వారుండగా వారిలో కొంతమంది కోర్టు స్టే తెచ్చుకోనున్నారు. అలాగే నాన్ టీచింగ్ కింద 36 మంది, 24 మంది కాంట్రాక్టు పద్ధితిలో పనిచేశారు. వారి పరిస్థితి ఏమిటన్నది వెల్లడి కావాల్సి ఉంది. జేఎన్‌టీయూ ఏ ప్రాతిపదికన స్కిట్ కళాశాలతో అనుసంధానం అయిందో అనే విషయంపై త్వరలోనే వెల్లడి కావాల్సి ఉంది.

ఎంపీపీ ద్విచక్ర వాహనం చోరీ