రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు
గుడిపాల: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆదివారం నేపాల్‌కు చెందిన అర్జున్‌బహుదూర్(39) గుడిపాల మండలం 197రామాపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైల్లో నుంచి నిద్రమత్తులో జారి కింద పడ్డాడు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 ఈఎంటీ బద్రి, ఫైలట్ బాబి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్జున్ బహుదూర్ తలకు బలమైన గాయం తగిలినట్లు తెలిపారు. అనంతరం చిత్తూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.


