● నేటి నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం ● నో సెల్‌ఫోన్‌ జోన్‌లుగా పరీక్ష కేంద్రాలు ● అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన ● ప్రతి రూములో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం ● నో సెల్‌ఫోన్‌ జోన్‌లుగా పరీక్ష కేంద్రాలు ● అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన ● ప్రతి రూములో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

Published Fri, Mar 1 2024 1:38 AM

-

పరీక్షల షెడ్యూల్‌ ఇలా..

మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు, పరీక్షకు మధ్య ఒక రోజు విరామం వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, రెండో రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి.

భయాందోళన లేకుండా రాయాలి..

విద్యార్థులు భయాందోళన చెందకుండా పరీక్షలు రాయాలి. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు ప్రయాణించవచ్చు. ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌. – షణ్మోహన్‌, కలెక్టర్‌, చిత్తూరు

మంచి వాతావరణంలో రాసేలా..

ఇంటర్‌ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో 08572–293867 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలపవచ్చు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా రెవెన్యూ, పోలీస్‌ శాఖల సహకారం తీసుకుంటున్నాం.

– సయ్యద్‌ మౌలా, ఇంటర్‌, డీవీఈఓ, చిత్తూరు

ఇంటర్మీడియెట్‌ పరీక్షల వివరాలు..

ఇన్విజిలేటర్లు

750

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో పరీక్షల నిర్వహణకు 50 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంట్‌ అధికారి చొప్పున మొత్తం 100 మందిని నియమించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు 50 మంది, డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. వీరితో పాటు 2 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 750 మంది ఇన్విజిలేటర్లు, 2 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలు, పరీక్షకు సంబంధించిన గోప్యమైన వస్తువులు, పత్రాలను భద్రపరచడానికి 25 స్టోరేజీ పాయింట్లను అందుబాటులోకి తెచ్చారు.

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు..

మార్చి 1న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, 4న ఇంగ్లిష్‌ పేపర్‌–1, 6న గణితం పేపర్‌–1ఏ, బోటనీ పేపర్‌–1, సివిక్స్‌ పేపర్‌–1, 9న గణితం పేపర్‌–1బీ, జువాలజీ పేపర్‌–1, హిస్టరీ పేపర్‌–1 పరీక్షలు జరుగుతాయి. 12న ఫిజిక్స్‌ పేపర్‌–1, ఎకనామిక్స్‌ పేపర్‌–1, 14న కెమిస్ట్రీ పేపర్‌–1, కామర్స్‌ పేపర్‌–1, సోషియాలజీ పేపర్‌–1, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌–1, 16న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌–1, లాజిక్‌ పేపర్‌–1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు గణితం పేపర్‌–1, 19వ తేదీన చివరి పరీక్షగా మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, జాగ్రఫీ పేపర్‌–1 పరీక్షలు జరుగుతాయి.

ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు..

మార్చి 2న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, 5న ఇంగ్లిష్‌ పేపర్‌–2, 7న గణితం పేపర్‌–2ఏ, బోటనీ పేపర్‌–2, సివిక్స్‌ పేపర్‌–2, 11న గణితం పేపర్‌–2బీ, జువాలజీ పేపర్‌–2, హిస్టరీ పేపర్‌–2 పరీక్షలు జరుగుతాయి. 13న ఫిజిక్స్‌ పేపర్‌–2, ఎకనామిక్స్‌ పేపర్‌–2, 15న కెమిస్ట్రీ పేపర్‌–2, కామర్స్‌ పేపర్‌–2, సోషియాలజీ పేపర్‌–2, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌–2, 18న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌–2, లాజిక్‌ పేపర్‌–2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు గణితం పేపర్‌–2, 20వ తేదీన చివరి పరీక్షగా మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, జాగ్రఫీ పేపర్‌–2 పరీక్షలు జరుగుతాయి.

ప్రథమ సంవత్సరం విద్యార్థులు 15,905

జనరల్‌ విద్యార్థులు 28,225

చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులు 100

వొకేషనల్‌ విద్యార్థులు 4,532

ఏర్పాటు చేసిన

సీసీ కెమెరాలు 500

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 04

ద్వితీయ సంవత్సరం విద్యార్థులు

16,852

Advertisement
 
Advertisement
 
Advertisement