రూ.రెండొందలు తీసుకో.. ఫొటోకు ఫోజిచ్చుకో..

మాట్లాడుతున్న కుప్పయ్య   - Sakshi

శ్రీరంగరాజపురం: ‘రూ.రెండు వందలు తీసుకోండి.. ఫొటోకు ఫోజు ఇవ్వండి’ అని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ థామస్‌ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని వెంకటాపురం సచివాలయం పరిధిలో పొదలపల్లె దళితవాడలో మీ ఇంటికే మీ థామస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం లేక వెలవెలబోయింది.

ప్రతి ఇంటికీ వెళ్లి రూ.200 ఇచ్చి తన వెంటా నడిస్తే మీకు మరిన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా జనం రాకపోవడంతో గంగాధరనెల్లూరు మండలంలోని కొండేపల్లెలో తమ గ్రామానికి చెందిన బంధువు అంత్యక్రియలకు వెళుతున్న వారిని పిలిచి రూ.200 తీసుకోండి ఫొటోకు ఫోజు ఇవ్వండి అని చెప్పి వారికి పార్టీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

తమ గ్రామం ఎప్పటికీ వైఎస్సార్‌సీపీ కంచు కోట అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పయ్య మాట్లాడుతూ టీడీపీ అధినేతకు తాము ఏ మాత్రం తీసిపోమని అన్నట్లు థామస్‌ వ్యవహరశైలి ఉందన్నారు. శ్రీరంగరాజపురం మండలం వైఎస్సార్‌సీపీ పార్టీకి కంచుకోట అని అన్నారు. టీడీపీ ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top