బ్యాంకులే కస్టమర్లకు ఫైన్‌ కట్టాలి.. ఎందుకో తెలుసా?

You will be paid 500 per day if there is delay Credit card closure rules - Sakshi

సాధారణంగా బ్యాంకులకు కస్టమర్లకు పైన్‌ కడుతుంటారు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెన్ టైన్ చేయకపోవడమో లేదా తీసుకున్న లోన్ సరైన సమయంలోగా చెల్లించకపోయిన బ్యాంకులు పెనాల్టీ వేస్తుంటాయి. మరి బ్యాంకుల నుంచి కస్టమర్లు కూడా ఫైన్ కట్టించుకోవచ్చని తెలుసా ? నిబంధనలు పాటించకపోతే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు కూడా ఫైన్‌ కట్టాల్సిందే. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం బాగా విస్తృతం అయింది. దాదాపు అందరూ వీటిని ఉపయోగిస్తుంటారు. చేతిలో డబ్బు లేనప్పుడు వాటిని ఉపయోగించి వస్తువులు కొనుకోవడం, ఇతరత్రా అవసరాలకు డబ్బు వాడుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాడుకున్న డబ్బు సరైన సమయానికి చెల్లించని పక్షంలో పెనాల్టీల ద్వారా బా​ంకులు కస్టమర్ల నుంచి అధిక ఫైన్ వసూలు చేస్తుంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నవారు, వాటి అవసరం లేదనుకున్నవారు క్లోజ్ చేస్తుంటారు.

ఇలా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుంటాయి. ఎందుకంటే వాటి నుంచి ఫీజ్ ల ద్వారా వచ్చే ఆదాయం పోతుందనే భావనతోనో లేదా మరేదైనా కారణంతో బ్యాంకులు కొంత ఆలస్యం చేస్తుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని బ్యాంకును ఆశ్రయించిన తరువాత వారం రోజుల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు దాటినప్పటికి ఆ బ్యాంకు నిర్లక్ష్యం వహిస్తే ఆ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు సంబంధిత బ్యాంక్ పై ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆ బ్యాంకు నిర్లక్ష్యం చేసిన రోజులన్నిటికి రోజుకు రూ. 500 చొప్పున పెనాల్టీ రూపంలో బాధిత కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top