ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు.. | Why Home Sales in Two Tier Cities Are Decreasing | Sakshi
Sakshi News home page

ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..

Oct 23 2024 9:49 AM | Updated on Oct 23 2024 10:19 AM

Why Home Sales in Two Tier Cities Are Decreasing

దేశవ్యాప్తంగా 30 ద్వితీయ శ్రేణి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జులై–సెప్టెంబర్‌లో 41,871 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 13 శాతం తగ్గాయని ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ఈ క్షీణతకు కారణం అని వివరించింది.

నివేదికలోని వివరాల ప్రకారం..కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 34 శాతం క్షీణించింది. మొత్తం విక్రయాల్లో అహ్మదాబాద్, వడోదర, గాందీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌తో కూడిన వెస్ట్‌ జోన్‌ వాటా 72 శాతం ఉంది. తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానుల్లో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్‌ మార్కెట్‌ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా వేశారు.

ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు

‘ద్వితీయ శ్రేణి నగరాలు రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడికి పెద్దగా అనుకూలించవు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా వృద్ధి ఉండకపోవడం, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరసి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement