వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌

WhatsApp publishes FAQ on upcoming Disappearing Messages feature - Sakshi

కొత్త స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌

ఫార్వార్డ్‌ మెసేజ్‌లను సులభంగా డిలీట్‌ చేసుకునే అవకాశం

5ఎంబీకంటే ఎక్కువ సైజు  ఫైలును గుర్తించే ఫీచర్‌

సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. పలు గ్రూపులు, వ్యక్తుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోలు తదితర కంటెంట్‌ను డిలీట్‌​ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లంకదా. తాజాగా ఇలాంటి జంక్ మోసేజెస్‌ను సులువుగా తొలగించేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.  దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ఫోన్‌లలో స్టోరేజ్‌ డాటాను  పెంచుకోవచ్చని వాట్సాప్‌ వెల్లడించింది.

వినియోగదారులకు ఉపయోగపడే విదంగా స్టోర్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తద్వారా పలుసార్లు ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన  వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభం తొలగించుకోవచ్చు. 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైలును గుర్తిస్తుంది. పరిమాణంలో ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకూ వాట్సాప్ ‘స్టోరేజ్ యూసేజ్’ విభాగం కింద చాట్‌లు కనిపించేవి. తాజా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక ఇంటర్‌ఫేస్‌మీద ఒక బార్‌మీద కనిపిస్తుంది. ఇందులో మీడియా కంటెంట్ ద్వారా ఎంత స్టోరేజ్‌ వినియోగించాం అనేది చూపిస్తుంది. అలాగే చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన మీడియా ఫైళ్ళను  ప్రత్యేకంగా చూపిస్తుంది. దీంతో అలాంటి ఫైళ్ళను సులభంగా గుర్తించి డిలీట్‌​ చేయడానికి సహాయపడుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top