Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌! అదేంటంటే..

WhatsApp developing Ability To Pin Messages Within Chats And Groups - Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. త్వరలో మరో ఆసక్తికర ఫీచర్‌ను తీసుకురానుంది.  చాట్‌, గ్రూప్‌ చాట్‌లలో యూజర్లు మెసేజ్‌లను పిన్‌ చేసుకునే వెసులుబాటును కల్పించనుందని వాబేటాఇన్‌ఫో(WABetaInfo) నివేదిక పేర్కొంది.  ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో రానున్న అప్‌డేట్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్‌తో ఉపయోగం ఇదే..
వాట్సాప్‌ చాట్‌, గ్రూప్‌చాట్‌లలో యూజర్లు చేసుకునే మెసేజ్‌లలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని  టాప్‌లో పెట్టుకునేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత చాట్‌లో ఉన్న ఇద్దరూ లేదా గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఈ కొత్త అప్‌డేట్‌ చేసుకుని ​ఉంటే పిన్‌ చేసిన మెసేజ్‌లు అందరికీ టాప్‌లో కనిపిస్తాయి. ఒకవేళ అవతల వ్యక్తి పాత వర్షన్‌ను వినియోగిస్తన్నట్లయితే కొత్త వర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోమని యాప్‌ సూచిస్తుంది.

వాట్సాప్‌ ఇప్పటికే కాలింగ్‌ షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేసుకునే ఫీచర్‌ను తీసుకురావడంపైనా పనిచేస్తోందని వాబీటాఇన్‌ఫో నివేదిక ఇదివరకే తెలియజేసింది. ఇలా సరికొత్త ఫీచర్లు వస్తుండటంతో ఈ మెసేజింగ్‌ యాప్‌కు యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో, 200 కోట్ల మందికిపైగా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top