వాట్సాప్‌లో మూడో బ్లూటిక్‌ ఫీచర్‌! ఇంతకీ వాట్సాప్‌ ఏం చెప్పిందంటే..

WhatsApp Clarifies On Bring Third Blue Tick Feature - Sakshi

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్లు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈలోపు మరో కొత్త ఫీచర్‌ అంశం తెర మీదకు వచ్చింది. మూడో బ్లూటిక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉందంటూ కొన్ని టెక్‌ బ్లాగులు రాసుకొచ్చాయి. దీనిపై వాట్సాప్‌ బ్లాగ్‌ స్పందించింది. 

మూడో టిక్‌ దేనికంటే.. సాధారణంగా వాట్సాప్‌లో ఎవరికైనా సందేశాలు పంపినప్పుడు.. సెండ్‌ అయ్యాక సింగిల్‌ గ్రేటిక్‌, అవతలి వాళ్లకు రిసీవ్‌ అయినా, లేదంటే ప్రైవసీలో ఉండి ఆ సందేశాన్ని చూసినా డబుల్‌ గ్రేటిక్‌ పడుతుంది. ఒకవేళ ప్రైవసీలో లేకుండా చూస్తే డబుల్‌ బ్లూటిక్‌ పడుతుంది. అయితే యూజర్‌ పంపిన మెసేజ్‌ను అవతలి వాళ్లు స్క్రీన్ షాట్‌ తీస్తే మూడో టిక్‌ పడుతుందని, తద్వారా అవతలివాళ్లకు తెలిసిపోతుందనేది ఆ బ్లాగ్‌ కథనాల సారాంశం.  

అయితే వాట్సాప్‌ అప్‌డేట్‌ ఫీచర్లపై పక్కాగా అందించే అధికారిక బ్లాగ్‌ బేటాఇన్ఫో ఈ కథనాల్ని ఫేక్‌గా తేల్చేసింది. మూడో టిక్‌ ఆప్షన్‌ తేవట్లేదని క్లారిటీ ఇచ్చింది.  ఇలాంటి మెకానిజం కోసం వాట్సాప్‌ ఓనర్‌కంపెనీ మెటా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని స్పష్టత ఇచ్చింది.

చదవండి: గ్రూప్‌లో పెట్టిన మెసేజ్‌కి అడ్మిన్‌ బాధ్యుడు కాదు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top