వార్నింగ్‌.. ఈ ట్రిక్‌తో మనల్ని ఈజీగా ట్రాక్‌ చేస్తారు!

Warning: Using This Trick Track Someone Location By Google Maps - Sakshi

టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇక మొబైల్‌ ఉంటే చాలు ఏదైనా మన ముందుకే వస్తోంది. తినే తిండి నుంచి, షాపింగ్‌ వరకు ఇంటి నుంచి కదలకుండా ప్రజలు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీ వల్ల కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. 

ఇలా ట్రాక్‌ చేసేయండి!
సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ ప్రదేశాన్నికనుక్కోవాలన్నా అందరి చూపు గూగుల్ మ్యాప్స్ వైపు. అంతేనా ఒకరిని ట్రాకింగ్‌ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా వ్యక్తుల లొకేషన్ను ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో ఓ లుక్కేద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో అయితే వాట్సప్లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి.

కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్‌కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్‌ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు మన అనుమతితోనే జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్‌ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మన ఈమెయిల్‌కి లేదా ఫోన్‌కి మెసేజ్‌ రూపంలో తెలియని వ్యక్తులు లింక్‌లు పంపితే, వాటిని ఓపన్‌ చేయకుండా, వెంటనే డెలీట్‌ చేయడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. 

చదవండి: Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్‌ మహీంద్రా వైరల్‌ వీడియో
టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top