Vizag Steel: స్టీల్‌ప్లాంట్‌ టర్నోవర్‌ రూ. 17,980 కోట్లు

Vizag Steel Achieved A Sales Turnover Of Rs 17 980 Crore - Sakshi

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్‌ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌ భట్‌ వివరాలను ప్రకటించారు.

 
స్టీల్‌ప్లాంట్‌ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు

సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్‌ టన్నుల నుంచి 1.308 మెట్రిక్‌ టన్నులకు పెరిగాయన్నారు.  గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు.   

సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్‌ సెక్రటరీ సుభాష్‌ కుమార్, స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్‌ డాక్టర్‌ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top