Vivo Offers Exclusive Special Offers For X70 Series Customers With X Care - Sakshi
Sakshi News home page

Vivo X Care: ఎక్స్‌70 సిరీస్‌ కస్టమర్లకు వివో ప్రత్యేక సర్వీసులు

Dec 3 2021 8:37 AM | Updated on Dec 3 2021 9:02 AM

Vivo Offers Special Services For X 70 Customers - Sakshi

హైదరాబాద్‌: కొన్నాళ్ల క్రితం ఆవిష్కరించిన ఎక్స్‌ సిరీస్‌ ఫోన్ల కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించడానికి ఎక్స్‌ కేర్‌ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించినట్లు స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం వివో వెల్లడించింది. ఈ ప్రోగ్రాం కింద వివో ఎక్స్‌70 సిరీస్‌ కస్టమర్లందరూ వర్చువల్‌ లైవ్‌ డెమో సెషన్లు, ఉత్పత్తుల హోమ్‌ డెలివరీ, ఇంటి వద్దే రిపేర్‌ సర్వీసులు మొదలైన సదుపాయాలు పొందవచ్చని పేర్కొంది. ఇరవై నాలుగ్గంటలూ నేరుగా ఏజంటుకు కాల్‌ చేసే ఫీచర్‌తో పాటు వివో సర్వీస్‌ సెంటర్లలో ఎక్స్‌క్లూజివ్‌ కౌంటర్‌ కూడా ఉంటుందని వివరించింది.

హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కస్టమర్ల ఇంటి దగ్గరే రిపేర్‌ సర్వీసులు కూడా పొందవచ్చని వివో తెలిపింది. సెంటర్‌కు 30 కి.మీ. పరిధిలో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవచ్చని, అది దాటితే పికప్, డ్రాప్‌ సర్వీసు పొందవచ్చని పేర్కొంది. ఒక ఐఎంఈఐ నంబరుకు మూడు ఉచిత సర్వీసులు అందుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి విజిట్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement