వివో వై1ఎస్ వచ్చేసింది

Vivo Entry Level Smartphone Y1s Launched in India - Sakshi

వివో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం వివో వై1ఎస్ రూపంలో మొబైల్ ని తీసుకొచ్చింది. సాదారణంగా సోషల్ మీడియా ద్వారా ఫోన్‌ను ప్రకటించే బదులు, ఈ సారి తన వెబ్‌సైట్‌ ద్వారా ఫోన్‌ను తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.(చదవండి: పడిపోయిన మొబైల్ అమ్మకాలు)

వివో వై1ఎస్ స్పెసిఫికేషన్స్

వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం దీని 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top