వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో విషాదం..నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తూ | Kuber Group Director Vikas Malu Injured With High Speed Crash Of Rolls Royce And Oil Tanker - Sakshi
Sakshi News home page

Kuber Group Director Injured: స్పీడ్తో పెట్రోల్‌ ట్యాంకర్‌ను డీకొట్టిన రోల్స్ రాయిస్ ఫాంటమ్..ఆ కారులో కుబేర్‌ గ్రూప్‌ అధినేత వికాస్‌ మాలు

Aug 26 2023 8:49 AM | Updated on Aug 26 2023 10:30 AM

Vikas Malu Injured With High Speed Crash Of Rolls Royce And Oil Tanker - Sakshi

హర్యానా రాష్ట్రం, నూహ్‌ జిల్లా న్యూఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.190 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు యూటర్న్‌ తీసుకుంటున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి రోల్స్‌ రాయిస్‌ కారు తునాతునకలైంది.

అయితే, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న నగీనా పోలీస్‌స్టేషన్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణలో రోడ్డు ప్రమాదానికి రోల్స్‌ రాయిల్స్‌ కారు ప్రముఖ వ్యాపార వేత్త, కుబేర్‌ గ్రూప్‌ అధినేత వికాస్‌ మాలు’దేనని గుర్తించారు. దీంతో వేలకోట్ల కుబేర్‌ గ్రూప్‌ సామ్రాజ్యంలో విషాదం అలుముకుంది.

నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తూ
మితిమీరిన వేగంతో వికాస్‌ ప్రయాణిస్తున్న రోల్స్‌ రాయిస్ కారు యూటర్న్‌ తీసుకుంటున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో వికాస్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయాపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు నెత్తురోడుతూ హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇక ఈ కారు ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని నూహ్‌ ఎస్పీ నరేంద్ర బిజర్నియా మీడియాకు తెలిపారు. ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌, అతని అసిస్టెంట్‌ అక్కడికక్కడే మృతి చెందగా..మరో డ్రైవర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు. వికాస్‌ రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రమాదంలో కారు డ్రైవర్‌ మినహా మిగిలిన ప్రయాణికులు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న నగీనా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపిన ఎస్పీ బిజర్నియా..వికాస్‌ మలు ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదం జరిగే సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే వివరాలపై స్పందించారు. వికాస్‌ మాలు, అతని డ్రైవర్‌ గుర్‌గావ్‌ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వికాస్‌కు ప్రమాదం లేదని అన్నారు. వైద్యులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. డిశ్చార్జ్‌ అనంతరం, రోల్స్‌ రాయిల్స్‌ కారు డ్రైవర్‌ స్టేట్మెంట్‌ను రికార్డ్‌ చేయనున్నారు. 

అతివేగం 
కుబేర్‌ గ్రూప్‌ రోడ్డు ప్రమాదంపై ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. హైవేపై పెట్రోల్‌ ట్యాంకర్‌ యూటర్న్‌ తీసుకున్న సమయంలో రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారు అతివేగతంతో ప్రయాణిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.  శాస్త్రీయ పరీక్షల తర్వాతే కారు కచ్చితమైన స్పీడ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

హర్యానాలోని ఉజినాలోని తన ఇంట్లో గాయాల నుంచి కోలుకుంటున్న ట్యాంకర్‌లో మూడో వ్యక్తి గౌతమ్‌ మాట్లాడుతూ.. ట్రక్కు యు టర్న్ తీసుకుంటుండగా రోల్స్ రాయిస్ ఢీ కొట్టిందని డ్రైవర్, అసిస్టెంట్ పక్కనే కూర్చున్న గౌతమ్ తెలిపారు. ఫాంటమ్ వేగం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అన్నారు. తమ ట్యాంకర్‌ను ఢీకొట్టిన తర్వాత బోల్తా పడింది. కారు డ్రైవర్‌దే తప్పని ఆయన పేర్కొన్నారు.

వికాస్‌ ఆరోగ్యంపై స్పష్టత వచ్చేది అప్పుడే
రోడ్డు ప్రమాదం తీవ్రత కారు తీరును చూస్తే అర్ధమవుతుంది. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ కారు ట్రక్‌ను ఢీకొట్టిన వెంటనే దాని ముందు భాగం ధ్వంసమైంది. ఇంజిన్‌ కాలిపోయి డోర్లు తెరుచుకున్నాయి. మంటలు వ్యాప్తించిన తర్వాత మెటల్‌ మాత్రమే మిగిలి పోయి ట్రక్కు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఘోర రోడ్డు ప్రమాదంపై కుబేర్‌ గ్రూప్‌ పూర్తి వివరాల్సి అందించాల్సి ఉంటుంది. అదే జరిగితే వికాస్‌ మాలు ఆరోగ్యంపై స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement