వొడాఫోన్‌ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్‌ సర్వీసులు | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్‌ సర్వీసులు

Published Fri, Oct 27 2023 4:09 AM

Vi Business launches IoT in collaboration with C-DOT - Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌–యాజ్‌–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్‌–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్‌ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది.

ఇంటర్‌ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అరవింద్‌ నెవాతియా తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement