మీ పాన్‌ కార్డును అప్‌డేట్‌ చేయండి ఇలా...! | Update Your Details In Pan Card Like This | Sakshi
Sakshi News home page

మీ పాన్‌ కార్డును అప్‌డేట్‌ చేయండి ఇలా...!

Jul 27 2021 8:34 PM | Updated on Sep 20 2021 11:42 AM

Update Your Details In Pan Card Like This - Sakshi

పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(PAN) పాన్‌ కార్డు దేశవ్యాప్తంగా ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలను జరిపే వారికి పాన్‌కార్డ్‌ అనేది తప్పనిసరి. పాన్‌కార్డులో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే భవిష్యత్తులో సమస్యగా మారుతుంది. వీలైనంత త్వరగా పొరపాట్లను సరిదిద్దుకోవాలి. పాన్‌కార్డులోని పొరపాట్లను ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్‌ చేయవచ్చును. 

మీ పాన్‌ కార్డును ఇలా అప్‌డేట్‌ చేయండి...!
1. మీ బ్రౌజర్‌లో https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్‌సైట్‌ను ఒపెన్‌ చేయండి.

2. మీకు ఆన్‌లైన్‌ పాన్‌ అప్లికేషన్‌ ఫారం మీకు కనిపిస్తోంది. అందులో ‘అప్లై ఆన్‌లైన్‌’ను ఎంచుకోండి. 

3.అందులో ‘అప్లికేషన్‌ టైప్‌’ను ఎంచుకోండి. అందులో ఛేంజేస్‌ ఆర్‌ కరెక‌్షన్‌ ఇన్‌ ఎక్జ్సిటింగ్‌ పాన్‌ డేటాను ఎంచుకోండి. కేటగీరి ఆప్షన్‌లో  ఇన్డివిజువల్‌ను ఎంచుకోండి.

4.  మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి.

5. కాప్చాకోడ్‌ను ఫిల్‌ చేసి సబ్మిట్‌ ఆప్షన్‌పై నోక్కండి. 

6. మీ సమాచారాన్ని ఫిల్‌ చేసి ఎంటర్‌ చేశాక వెబ్‌సైట్‌ నుంచి టోకెన్‌ నంబర్‌ ఈ-మెయిల్‌కు వస్తుంది. అందులో కంన్టిన్యూ బటన్‌ క్లిక్‌ చేయండి.
7. మీరు మరొక వెబ్‌ పేజీకి మళ్లించబడతారు. తరువాత ‘NSDL e-gov’లో ఈ-సైన్‌ ద్వారా స్కాన్‌ చేసిన చిత్రాలను సమర్పించండి.
8. వెబ్‌పేజీలో అడిగే అవసరమైన సమాచారాన్ని పూరించండి. తదుపరి క్లిక్‌ చేయండి. 
9. తరువాత మీ అడ్రస్‌కు సంబంధించిన వెబ్‌ పేజీకి మళ్లించబడతారు. 
10. మీ అడ్రస్‌, వయసు, గుర్తింపు ఉన్న కార్డును , పాన్‌ కార్డును అప్‌లోడ్‌ చేయండి. 
11. డిక్లరేషన్‌పై సంతకం చేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి.
12. తరువాత పేమెంట్‌ గేట్‌ వే ఆప్షన్‌ వెబ్‌ పెజీకి మళ్లించబడతారు . పేమెంట్‌ అయ్యాక మీకు రశీదు వస్తోంది. 
13. రశీదును ప్రింట్‌ తీసుకొండి​, మీ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోతో పాటు  రసీదు స్లిప్‌లో సూచించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఈ పత్రాలను   NSDL e-gov కార్యాలయానికి పంపాలి. 

కొద్దిరోజుల తరువాత మీ అప్‌డేట్‌ అయినా సమాచారంతో మీకు పాన్‌ కార్డు వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement