ITR Filing for AY 2023-24: Unlikely To Income Tax Return Due Date Extension For AY 2023-24, Check Details - Sakshi
Sakshi News home page

ITR Filing for AY 2023-24: ఎడతెగని వర్షాలు: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు గడువు మరో నెల పొడిగింపు?

Jul 22 2023 7:06 PM | Updated on Jul 22 2023 7:34 PM

unlikely to ITR filing deadline extension check details - Sakshi

ITR filing 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్ను (ఐటీఆర్‌) దాఖలుకు గడువు సమీపిస్తోంది. మరో తొమ్మిది రోజుల్లో అంటే జూలై 31 నాటికి ఈ గడువు ముగియనుంది. అలాగే డెడ్‌లైన్‌ ముగిసేలోపు, రిటర్న్స్‌ దాఖలు  చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్‌ మల్హోత్రా ఇప్పటికే సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని ఇటీవల స్పష్టం చేశారు.

అయినప్పటికీ ఈ ఏడాది గడువు పెంపు ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు.  గతంలో, ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది.  అలాగే ప్రస్తుత వరదలు, అనిశ్చిత వాతారణ పరిస్థితుల నేపథ్యంలో  ఈ ఏడాది పొడిగింపు ఉంటుందా లేదా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.  (నేను అప్పుడే వార్నింగ్‌ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు)

మరోవైపు ఇన్‌కమ్‌ టాక్స్‌ ఫైలింగ్‌  గడువును ఒక నెల పెంచాలంటూ  సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది.  ఈ మేరకు ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో వరదల కారణంగా ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌ సహా చాలా ఆఫీసులు  పనిచేయ లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  దీనిపై ఆదాయపన్ను శాఖ  అధికారిక ప్రకటన తర్వాత  పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి)

కాగా ఐటీఆర్‌ ఫైలింగ్‌ పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్‌ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్‌ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్‌ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement