Union Bank of India secures 1st Rank in EASE reforms - Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ నంబర్‌ వన్‌! ఈజ్‌ రీఫార్మ్స్‌ ఇండెక్స్‌లో మొదటి స్థానం

Apr 20 2023 7:17 AM | Updated on Apr 20 2023 10:14 AM

union bank of india secures 1st rank in ease reforms - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ప్రకటించిన ఈజ్‌ రీఫార్మ్స్‌ ఇండెక్స్‌లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిర్దేశించిన సంస్కరణల అమలులో అన్ని బ్యాంకుల్లోకి యూనియన్‌ బ్యాంక్‌ ముందుంది.

అనలైటిక్స్‌ సామర్థ్యాలు, కస్టమర్లతో సంబంధాలు బలోపేతం, సమర్థవంతంగా రుణాల పర్యవేక్షణ, సమగ్రమైన డిజిటల్‌ వసూళ్ల నిర్వహణ విధానం, మోసాలు, సైబర్‌ దాడుల నుంచి తగిన రక్షణ చర్యలు, బ్యాంకింగ్‌ సేవలను అందించే విషయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తదితర విభాగాల్లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంచి పనితీరు చూపించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి అని బ్యాంక్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement