యూనియన్‌ బ్యాంక్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌

Union Bank Of India Launches Ethical Hacking Lab Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌లో ఎథికల్‌ హ్యాకింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించింది. బ్యాంక్‌నకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో దీనిని ఏర్పాటు చేసింది. బ్యాంక్‌ సమాచార వ్యవస్థలు, డిజిటల్‌ ఆస్తులు, విభా గాలను సైబర్‌ దాడుల నుండి రక్షించడానికి రక్షణ యంత్రాంగాన్ని రూపొందించడం ఈ ల్యా బ్‌ లక్ష్యం.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో ఏ.మణిమేఖలై శుక్రవారం ఈ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ ఈడీలు నితేశ్‌ రంజన్, రజనీశ్‌ కర్నాటక్, నిధు సక్సేనా పాల్గొన్నారు. 

చదవండి:  TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top