Twitter merges with Elon Musk's everything app called 'X' - Sakshi
Sakshi News home page

కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!

Apr 12 2023 8:58 AM | Updated on Apr 12 2023 9:57 AM

Twitter merges into the new app elon musk gave a huge shock - Sakshi

ట్విటర్‌ కంపెనీని ఎలన్ మస్క్ సొంత చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే! లెక్కకు మించిన ఉద్యోగులను ఇంటికి పంపించేశారు.  లోగో విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. పక్షి స్థానంలో కుక్కను.. కుక్క స్థానంలో పక్షిని చూపించి వినియోగదారులను సైతం కన్ఫ్యుస్ చేసేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ట్విటర్ మాయం కానున్నట్లు  వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం..

నివేదికల ప్రకారం, ట్విటర్‌ను ఎక్స్‌ అనే 'ఎవ్రీథింగ్‌ యాప్‌'లో విలీనం చేసినట్లు సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. మంగళవారం ట్విటర్ బాస్ ఎలోన్ మస్క్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో ‘ఎక్స్‌’ ఒకే అక్షరాన్ని ట్వీట్‌ చేశారు. మస్క్ ట్వీట్ చేసిన ఈ ఒక్క అక్షరం దేనిని సూచిస్తుందనే మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇది ట్విటర్ విలీనం కానున్న X Corp కంపెనీ అని భావిస్తున్నారు.

ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్‌ యాప్‌కు సంబంధించిన ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. గతంలో ఎక్స్‌ యాప్‌ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక అని, దీని రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విటర్‌ చాలా ఉపయోగపడుతుందని, ట్విటర్‌ను కొనుగోలు చేస్తే ఎక్స్‌ కంపెనీ ఏకంగా మూడు నుంచి ఐదు ఏళ్ళు ముందుకు సాగుతుందని అక్టోబర్ 2022లో ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు నిజం కానుంది.

(ఇదీ చదవండి: పేరుకే యూట్యూబర్! నెల సంపాదన రూ. కోటి కంటే ఎక్కువ..)

చైనాలో అందుబాటులో ఉన్న వీచాట్‌ మాదిరిగానే మెసేజింగ్‌, కాలింగ్‌ వంటి అనేక కార్యక్రమాలు ఒకే యాప్‌లో చేసుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే మా లక్ష్యం అని మస్క్ వెల్లడించారు. నిజానికి 1999లో ఈయన ఎక్స్ పేరుతో ఒక ఆన్‌లైన్‌ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ తరువాత దానిని పేపాల్‌లో విలీనం చేశారు. ఆ తరువాత ఎక్స్‌.కామ్‌ కొనుగోలు చేశారు, ప్రస్తుతం ట్విటర్‌ను కొత్త సూపర్‌ యాప్‌ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement