ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్

TVS NTORQ 125 global sales exceed one lakh - Sakshi

టీవీఎస్ మోటార్స్ ఎన్‌టీఓఆర్క్యూ(NTORQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్‌టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు.

ఆవిష్కరణలో బెంచ్‌మార్క్‌లను అందుకోవడం, కస్టమర్ల ఆకాంక్షను నెరవర్చడం ద్వారా టీవీఎస్ ఎన్‌టీఓఆర్క్యూ బ్రాండ్‌ను పెంచుకోవాలనే మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ అని కూడా అన్నారు. దీనిలో మంచి పనితీరు కోసం టీవీఎస్ రేసింగ్ పెడిగ్రీ సపోర్ట్, రేస్-ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ (RT-Fi) కలిగి ఉంది. టీవీఎస్ ఎన్‌టీఓఆర్క్యూలో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఈ కారణం వల్ల స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు.

అలాగే, నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇంటర్నల్ ల్యాప్-టైమర్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, రెడ్ కలర్ హాజార్డ్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, లెడ్ లైటింగ్, స్ట్రీట్ - స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టిక్స్ మోడ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎస్-VI స్కూటర్ డిస్క్, డ్రమ్ రేస్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్, ఎల్లో-బ్లాక్లలో లభిస్తుంది.

చదవండి:

మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్‌ జియో శ్రీకారం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top