ఆ స్కూటర్ ధరలు భారీగా పెంచిన టీవీఎస్ మోటార్

TVS Motor Hikes Prices of All Variants of Jupiter Scooter - Sakshi

ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ 110సీసీ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను భారీగా పెంచింది. ఈ స్కూటర్ ఐదు వేరియెంట్లలో లభిస్తుంది. కనిష్ఠంగా రూ.736 పెంచితే, గరిష్టంగా రూ.2,336 పెంచింది. షీట్ మెటల్ వీల్ వేరియెంట్ స్కూటర్ కొత్త ధర ఇప్పుడు ₹65,673, స్టాండర్డ్ మోడల్ స్కూటర్ ధర ₹67,398(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. జడ్ ఎక్స్ డ్రమ్, జడ్ఎక్స్ డిస్క్ ట్రిమ్ స్కూటర్ ధరలు వరుసగా ₹71,973, ₹75,773గా ఉన్నాయి. అయితే, క్లాసిక్ మోడల్ స్కూటర్ ధర ఇప్పుడు ₹75,743గా ఉంది. జూపిటర్ మోడల్ స్కూటర్ కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

TVS Jupiter variant Revised price
Sheet metal wheel variant ₹65,673
Standard Variant ₹67,398
ZX Drum ₹71,973
ZX Disc ₹75,743
Classic Variant ₹75,743

టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top