ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!

Toyota hilux new price list - Sakshi

భారతదేశంలో కేవలం కార్లకు, బైకులకు మాత్రమే కాకుండా పికప్ ట్రక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టొయోటా కంపెనీ గత ఏడాది 'హైలెక్స్' (Hilux) విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక వేరియంట్ ధరలను కొంత తగ్గించింది, మరో వేరియంట్ ధరలను పెంచింది.

వేరియంట్స్ & ధరలు:
నిజానికి టొయోటా హైలెక్స్ స్టాండర్డ్, హై అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ మీద ఏకంగా రూ. 3.59 లక్షలు తగ్గించింది. కావున ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30.40 లక్షలు. అదే సమయంలో హై మ్యాన్యువల్, ఆటోమాటిక్ మీద వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.10 లక్షలు పెంచింది. దీని ప్రస్తుత ధరలు రూ. 37.15 లక్షలు, రూ. 37.90 లక్షలు.

టయోటా ఈ ఏడాది ప్రారంభంలో తన రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఒక మోడల్ మీద భారీగా ధరలను తగ్గించి, మరో మోడల్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

డిజైన్ & ఫీచర్స్:
టయోటా హైలక్స్‌ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు ఇవ్వబడ్డాయి. ఈ పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్‌ పొందుతుంది.

(ఇదీ చదవండి: భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్)

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొలతలు:
టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. కావున దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్‌బేస్‌ 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ కాగా, బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో ఇదే భారీ వాహనం అని చెప్పాలి.

ఇంజిన్:
టయోటా హైలక్స్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ ద్వారా 204 బిహెచ్‌పి పవర్ 420 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది.

(ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..)

ప్రత్యర్థులు:
దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా హైలక్స్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉండటం వల్ల దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయిత్ ఇది 'ఇసుజు D-Max V-క్రాస్'కి అమ్మకాల్లో ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. కానీ దీని ధర హైలక్స్ కంటే చాలా తక్కువ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top