టయోటా హైలక్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

Toyota Hilux Bookings Resume In India, Prices Remains Unchanged - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ ప్రీమియం యుటిలిటీ వెహికిల్‌ హైలక్స్‌ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్‌ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది.

హైలక్స్‌ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ పొందుపరిచారు.

వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్‌.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సేల్స్, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ తెలిపారు.

చదవండి: నెలకు రూ.12వేలు పెన్షన్‌  కావాలా? ఇలా ట్రై చేయండి!
 
   

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top