ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ ! ఆ అప్‌డేట్‌ వచ్చేసింది

Today iPhone Users Will Recieve iOS 15 Update  - Sakshi

సెప్టెంబరులో ఐఫోన్‌ 13 సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన యాపిల్‌ సంస్థ తన ఓల్డ్‌ యూజర్లకు కానుక అందించింది. ఫోన్‌ పనితీరుని మరింతగా మెరుగు పరిచే అప్‌డేట్‌ని రిలీజ్‌ చేసింది. 

ఐఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌ని యాపిల్‌ విడుదల చేసింది. 20221 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్‌డేట్‌ని కస్టమర్లకు అందిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన వరల్డ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్‌ 15కి సంబంధించిన వివరాలను యాపిల్‌ వెల్లడించింది. అప్పటి నుంచి అప్‌డేట్‌ కోసం యాపిల్‌ యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

యాపిల్‌ యూజర్లకు చివరి సారిగా 14.8 అప్‌డేట్‌ అందింది. తాజాగా వచ్చిన ఐఓఎస్‌ 15 అప్‌డేట్‌తో ఫోన్‌ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్‌ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్‌, ఎక్స్‌ప్లోర్‌ విభాగంలో అప్‌డేట్‌ బాగా పని చేస్తుందని యాపిల్‌ చెబుతోంది

ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన 6, 7, 8 సిరీస్‌లతో పాటు ఎక్స్‌ఆర్‌ సిరీస్‌, 11, 12 , 13 సిరీస్‌ మోడల్స్‌కి ఈ అప్‌డేట్‌ అందిస్తోంది. సెప్టెంబరు 20 ఉదయం 10:30 గంటల నుంచి ఈ అప్‌డేట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 

చదవండి : ఐఫోన్‌-13 కొనుగోలుపై వోడాఫోన్‌-ఐడియా బంపర్‌ ఆఫర్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top