ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. అయితే నేడు (జూన్ 13) పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీ, చైన్నైలలో తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66150 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72160 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.
ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72310 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర మాత్రం రూ. 50 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు మాత్రమే నిన్న మాదిరిగానే ఉన్నాయి.
చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 210తగ్గి.. రూ. 66600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72660 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 13) ఒక కేజీ వెండి ధర రూ. 90700 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 600 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).


