పీఎల్‌ఐ పథకంతో టెక్స్‌టైల్స్‌లోకి

రూ. 1,536 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీముతో దేశీ టెక్స్‌టైల్స్ పరిశ్రమ రూ. 1,536 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన 56 దరఖాస్తుదారులకు ఇప్పటికే అనుమతి పత్రాలను జారీ చేసినట్లు వివరించింది. దేశీయంగా దుస్తులు, ఫ్యాబ్రిక్స్, తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం టెక్స్‌టైల్స్ రంగం కోసం రూ. 10,683 కోట్లతో పీఎల్‌ఐసీ స్కీమును ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ దరఖాస్తులు స్వీకరించింది. 64 దరఖాస్తుదారులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా, 56 దరఖాస్తుదారులు కొత్త కంపెనీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. దీనితో వారికి అనుమతి పత్రాలను కేంద్రం జారీ చేసింది.
సంబంధిత వార్తలు