తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లాభం హైజంప్‌ | Telangana Grameena Banks Profit High Jump: Hits Rs 1283 Cr Mark | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ లాభం హైజంప్‌

Apr 22 2026 2:26 PM | Updated on Apr 22 2026 2:57 PM

Telangana Grameena Banks Profit High Jump: Hits Rs 1283 Cr Mark

2025–26లో రూ. 1,283 కోట్లు

హైదరాబాద్‌: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,283 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 8 శాతం బలపడి రూ. 34,605 కోట్లను తాకాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 12 శాతంపైగా పెరిగి రూ. 46,548 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 4.33 శాతానికి మెరుగుపడ్డాయి.

స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 2.1 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు నమోదుకాలేదు. రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌(ఆర్‌వోఏ) 2.13 శాతంకాగా.. ఆర్‌వోఈ 14.1 శాతంగా నమోదైంది. గతేడాది బ్యాంక్‌ అత్యుత్తమ పనితీరు చూపినట్లు సంస్థ చైర్మన్‌ కె.ప్రతాప రెడ్డి పేర్కొన్నారు. నికర లాభం దాదాపు రెట్టింపైనట్లు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement